మనిషి స్వాభావికంగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఎన్నో విజయాలు సాధించినప్పటికీ, తన మనస్సులో దాగిఉన్న రాగ ద్వేషాలు, అహంకార మమకారాల వలన, అకస్మాత్తుగా వివేకం కోల్పోయి రాగద్వేష చక్రంలో నలిగిపోతూ, శోకము తద్వారా మొహమునకు గురియగును. ఈ అంతర్గత గందరగోళంలో, సానుకూల మరియు ప్రతికూల ప్రవృత్తుల మధ్య గొప్ప యుద్ధం ఉంటుంది.
భగవద్గీత మనిషిలోని ఈ గొప్ప ఆధ్యాత్మిక సంఘర్షణను చిత్రీకరిస్తుంది మరియు మనిషిని స్వాభావిక దైవత్వం మరియు సానుకూలత వైపు నడిపిస్తుంది. అలా చేయడం ద్వారా భగవద్గీత మనిషిని తనయొక్క యదార్థ శక్తి, సామర్థ్యం, వివేకంతో ప్రపంచంలో తన ఉద్దేశ్యాన్ని మరియు లక్ష్యాలను సాధించడానికి వారు ఉపయోగించే సాధన మార్గాలను వివరిస్తుంది. సంక్షిప్తంగా, ఒక మనిషి ఉన్నస్థితి నుండి ఉన్నత స్థితికి, మానవత్వం నుండి దైవత్వమునకు చేరుకొనే ఉపాయం అందించే మార్గదర్శి.
వేదము-ఉపనిషత్తుల సారాంశం అయిన భగవద్గీతపై ఆధ్యాత్మిక శాస్త్రవేత్త
స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి గారు రాసిన లఘువ్యాఖ్యా తాత్పర్యం అత్యుత్తమమైనది. ప్రస్తుత సమాజంలో యువతీ యువకులు సామాజిక మాధ్యమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న తరుణంలో వారి కర్తవ్యం, జీవితలక్ష్యం ఏమిటి అని తెలుసుకోవడానికి భగవద్గీత ఒక మార్గదర్శి. చీకటిలో ప్రయాణించే వారికి ఒక జ్యోతి కాగడా వలే ఈ లఘు వ్యాఖ్య అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రతి శ్లోకానికి తాత్పర్యాన్ని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగినది.




Reviews
There are no reviews yet.